పెద్దగొల్లగూడెం (దమ్మపేట): గతంలో అధికారులు ప్రతిపాధించిన ప్రదేశంలోనే పామాయిల్ రెండో ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేస్తానని, దీనిపై ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో చర్చించినట్టు అశ్వారావుపేట ఎమ్మె ల్యే, వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు చెప్పారు. అశ్వారావుపేట వ్యవసా య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దగొల్లగూడెంలో ఏర్పాటైన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, వ్యవసా య కళాశాల డీన్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాటి మాట్లాడు తూ.. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 33లక్ష ల రూపాయలు మంజూరైనట్టు చెప్పారు. ‘‘ఎ న్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధిలో వాటికి తావుండదు. నేను కూడా పామాయిల్ రైతునే. అందరినీ కలుపుకుని పనిచేస్తా’’ అని అన్నారు. పామాయిల్ సాగుతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. రైతులు పామాయిల్‌తోపాటు ఇతర పంటలపై కూడా దృష్టి సారించాలన్నారు. పామాయిల్ సాగుకు సంబంధించిన సబ్సిడీ విషయంలో ఏజెన్సీలోని గిరిజనేతర రైతులు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారని అన్నారు.
దీనిని ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రైతాంగాన్ని విద్యుత్ సమస్య తీ వ్రంగా వేధిస్తోందని, ఇది మరో ఏడాదిపాటు ఉండవచ్చని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కూడా విద్యుత్తుకు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు.
ఉద్యానవన శాఖ ఏడీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. పామాయిల్ రైతులకు గతంలో నాలుగేళ్లపాటు సబ్సిడీ ఉండేదని, దానిని ఇప్పుడు ప్ర భుత్వం మూడేళ్లకే పరిమితం చేసిందని అన్నా రు. పామాయిల్‌లో అంతర్ పంటలు వేసుకునే రైతులకు హెక్టారుకు మూడువేల రూపాయల ను ప్రభుత్వం రాయితీఇస్తోందన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలు మాత్రమే పామాయిల్ పంట సాగుకు అనుకూలమైనవని అన్నారు.
ఈ ఏడాది వెయ్యి హెక్టార్లకు పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లంవెంకమ్మ,జడ్పీటీసీ సభ్యురాలు దొడ్డాకుల సరోజని, సర్పంచ్ రాండాస్, ఎంపీటీసీ సభ్యులు జలగం శ్రీనివాస్, గంటా వెంకటేశ్వరరావు,పామాయిల్ రైతుసంఘం రా ష్ట్ర నాయకుడుమహేశ్వరరావు పాల్గొన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి
Published Sat, Aug 23 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement
Advertisement