అశ్వారావుపేట: అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఈపీఎఫ్ కుంభకోణం.. అక్కడి మేనేజర్ మెడకు చుట్టుకుంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ మేనేజర్‌పై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో స్థానిక ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయడంతో సమస్య మరింత తీవ్రమైంది. ఫ్యాక్టరీ మేనేజర్ ఈ నెల 5న హైదరాబాద్ వెళ్లారు.
గతంలో ఇక్కడ పనిచేసి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఉద్యోగోన్నతిపై ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వారిని కలిసి ‘నన్ను ఏదోరకంగా గట్టున పడేయండి’ అని బతిమిలాడుకుంటున్నట్టు తెలిసింది. ఈపీఎఫ్ కుంభకోణాన్ని ఆయిల్‌ఫెడ్ ఎండీ విష్టు స్వయంగా విచారిస్తున్నారని, అశ్వారావుపేట ఫ్యాక్టరీలోని రికార్డులను డిప్యూటీ మేనేజర్ సన్యాసిరావు ద్వారా తెప్పించుకున్నారని సమాచారం. ఈ విచారణను తప్పుదారి పట్టించేందుకు స్థానిక ఫ్యాక్టరీ మేనేజర్, కాంట్రాక్టర్ కుమారుడు మధు కలిసి ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో పైరవీలు సాగిస్తున్నట్టు తెలిసింది.
కార్మికుల వాటాల లెక్కింపు వేగవంతం
2007లో అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీలోని కార్మికులు ఎన్ని రోజులు పనిచేశారు? ఈపీఎఫ్ వాటాగా ఎంత సొమ్ము మినహాయించారు? కార్మికుని వాటాతోపాటు కాంట్రాక్టర్ వాటా కలిపి ఒక్కో కార్మికునికి నిబంధనల ప్రకారం ఎంత సొమ్ము ఈపీఎఫ్ ఖాతాలో జమ కావాల్సు ఉంది? అనే అంశాలను ఉన్నతాధికారి పరిశీలిస్తున్నారు. 2007 నుంచి ఏడాదివారీగా ఒక్కో కార్మికుని నెలసరి, రోజువారీ వేతనాన్ని పరిగణలోకి తీసుకుని, ఏడాదివారీగాఈపీఎఫ్ సొమ్మును లెక్కకట్టనున్నట్టు తెలిసింది. ఈ లెక్కంతా పూర్తయ్యాక ఈపీఎఫ్ కమిషనర్ అనుమతితో కార్మికుల ఈపీఎఫ్ సొమ్మును నిర్థారిస్తారని తెలిసింది.
ఈపీఎఫ్ కుంభకోణం కనుమరుగుకు యత్నాలు
Published Wed, Jul 9 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement
Advertisement