భార్యాబిడ్డలతో పామాయిల్ ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్య | Palm oil factory owner's suicide in rajamundry | Sakshi
Sakshi News home page

భార్యాబిడ్డలతో పామాయిల్ ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్య

Published Wed, Sep 11 2013 2:00 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Palm oil factory owner's suicide in rajamundry

కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఓ పారిశ్రామిక వేత్త తన భార్యాబిడ్డలతో ఆత్మహత్య చేసుకు న్న సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. అంబాజీపేటకు చెంది న పామాయిల్ ఫ్యాక్టరీ యజమాని పాబోలు వెంకట కిరణ్(28), అతడి భార్య లక్ష్మీశ్వేత(25)లు వారి కుమా ర్తె శర్వాణి(4), కుమారుడు జయదేవ్(1)లను హతమార్చి, వారూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 తన మావయ్య (భార్య తండ్రి) వివాహ వార్షికోత్సవం సందర్భంగా కిరణ్ భార్యాబిడ్డలతో రాజ మండ్రి వచ్చాడు. కార్యక్రమం ముగి శాక ఇంటికని బయలుదేరి జాంపేట లోని ఓ హోటల్‌లో ఆదివారం రాత్రి బస చేశారు. కిరణ్ తండ్రి రామసుబ్రహ్మణ్యం (రాంబాబు) రాత్రి 9 గంటలకు ఫోన్ చేయగా, తాను ఎక్కడున్న విషయం చెప్పకుండా, తలనొప్పిగా ఉందని.. మాత్రలు వేసుకుని పడుకుంటున్నట్టు కిరణ్ తెలిపాడని సమాచారం. కీడు శంకిం చిన రాంబాబు తన బంధువులు, మిత్రులకు విషయం తెలిపారు. వారు కిరణ్ కుటుంబం కోసం మిత్రుల ఇళ్ల వద్ద, రాజమండ్రిలోని హోటళ్లలో గాలింపు చేపట్టారు. ఇలాఉండగా కిరణ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా, శ్వేత చేతి మణికట్టుపై బ్లేడుతో గాయం చేసుకోవడం వల్ల మరణించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూంలో షింక్ వద్ద రక్తం మరకలు ఉండడంతో, గాయం చేసుకున్న చేతిని శ్వేత అక్కడ కడుక్కొని ఉండవచ్చని భావిస్తున్నారు. చిన్నారులు శర్వాణి, జయదేవ్‌లకు పాలలో విషం కలిపి పట్టించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
  కిరణ్ కారు జాంపేటలోని హోటల్ ప్రాంగణంలో ఉన్నట్టు సోమవారం ఉద యం బంధువులు గుర్తించారు. హోటల్ సిబ్బందిని విచారించగా, రూం నంబరు 107 కిరణ్ పేరిట నమోదైనట్టు తెలిసింది. గది తలుపులు తెరిచిచూడగా.. అప్పటికే కిర ణ్, అతడి భార్యాబిడ్డలు విగతజీవులుగా  పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫ్యాన్‌కు చీర తో ఉరి వేసుకుని కిరణ్ మృతదేహం వేలాడుతోంది. మంచం పక్కన నేల పై లక్ష్మీశ్వేత మృతదేహం, మం చం పై చిన్నారులు శర్వాణి, జయదేవ్‌ల మృతదేహాలు పడి ఉన్నాయి. సంఘటన స్థలాన్ని రాజమండ్రి సెం ట్రల్ జోన్ డీఎస్పీ నామగిరి బాబ్జీ, వన్‌టౌన్ సీఐ రమణరావు పరి శీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 రాత్రి 9 గంటలకు చివరి ఫోన్‌కాల్
 ఓ మంత్రి కారుకు ప్రమాదం జరిగిందని, ఆ మంత్రి పీఏకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోమని రాత్రి 9 గంటలకు కిరణ్‌కు ఫోన్‌లో చెప్పినట్టు అతడి తండ్రి రాంబాబు చెప్పా రు. తనకు తలనొప్పిగా ఉందని, రేపు ఫోన్ చేస్తానని కిరణ్ ఫోన్ పెట్టేసినట్టు ఆయన పోలీసులకు తెలిపా రు. కిరణ్ సెల్‌ఫోన్ నుంచి అదే చివరి ఫోన్‌కాల్ అని రాంబాబు చె ప్పారు. కిరణ్ తన భార్యాబిడ్డలతో అతడి మావయ్య ఇంట్లో ఉన్నట్టు భావించానని, హోటల్‌లో దిగినట్టు తెలియదని రాంబాబు ఆవేదన వ్య క్తం చేశారు. కిరణ్ భార్య శ్వేత కు టుంబీకులు రాజమండ్రిలోని దేవీ చౌక్‌లో మురళీ ఎలక్ట్రానిక్స్ అండ్ టైల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.  ముందురోజు తమతో శుభకార్యం లో పాల్గొన్నవారు అంతలోనే విగతజీవులుగా మారడంతో శ్వేత బంధువులు విషాదంలో మునిగిపోయా రు. చిన్నారులకు నూరేళ్లు నిండిపోయాయని విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement