ఎస్వీ మోహన్‌రెడ్డిని అనర్హుడుగా చేయాలి | SV mohanreddy to be disqualify | Sakshi
Sakshi News home page

ఎస్వీ మోహన్‌రెడ్డిని అనర్హుడుగా చేయాలి

Published Fri, May 13 2016 4:20 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

SV mohanreddy to be disqualify

స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం వినతి

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీలో చేరిన ఎస్వీ మోహన్‌రెడ్డిని శాసన సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు విజ్ఞప్తి చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు కళత్తూరు నారాయణస్వామి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ఏపీ శాసనసభ డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యను గురువారం సాయంత్రం 5.15 గంటలకు కలసి ఈ మేరకు ఒక ఫిర్యాదును సమర్పించారు.

స్పీకర్, శాసనసభ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో వారీ ఫిర్యాదును డిప్యూటీ కార్యదర్శికి అందజేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎస్వీ మోహన్‌రెడ్డి శాసనసభ్యునిగా కొనసాగే అర్హతను కోల్పోయారని, తక్షణం ఈ అంశంపై నిర్ణయం వెల్లడించాలని వారు కోరారు. ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకోవడంతోపాటు పార్టీని వీడుతున్నట్లు చేసిన  వ్యాఖ్యలను ఈ ఫిర్యాదు ద్వారా స్పీకర్ దృష్టికి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement