
ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కాసిపేట: ప్రభుత్వం ఓపెన్‌కాస్టుల(ఓసీ) పేరుతో భూములు స్వాధీనం చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని, ఓసీలకు వ్యతిరేకంగా ప్రజలతో కలసి ఉద్యమి స్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం పాదయాత్ర బుధవారం మంచిర్యాల జిల్లా కాసిపేట, మందమర్రి మండలాల్లో సాగింది.
ఈ సందర్భం గా వీరభద్రం మాట్లాడుతూ మిషన్ కాకతీయ ఎక్కడా రైతులకు ఉపయోగపడడం లేదని, కేసీఆర్ చెప్పినట్లు చెరువు గట్ల మీద రైతులు మేకలు కోసుకోవడం లేదని, కాంట్రాక్టర్లు మేకలు కోసుకుని విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. ఓపెన్ కాస్టు గనుల ఏర్పాటు, కేకే 2 ఓసీపీని వెంటనే ఉపసంహరించుకోవాలని, కొత్తగా ఏర్పాటు చేసే ఓపెన్ కాస్ట్‌ల స్థానంలో భూగర్భగనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలని సూచించారు.