మినహాయింపు ఇలా.. | tax benfit special story | Sakshi
Sakshi News home page

మినహాయింపుఇలా..

Published Wed, Jan 11 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

మినహాయింపు ఇలా..

మినహాయింపు ఇలా..

ఆదాయపన్ను చెల్లింపుతో కలిగే ప్రయోజనాలివే.. 
రూ.2.5లక్షల పైబడి ఆదాయం పొందే వారు పన్ను పరిధిలోకి
రాయవరం :  వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందేవారు తప్పని సరిగా ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు తప్పనిసరిగా తమ ఆదాయ పన్ను రిటర్న్స్‌ను ఫిబ్రవరి నెలాఖరులోపు డ్రాయింగ్‌ అధికారికి చెల్లించాలి. వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలపైబడి ఉన్నవారు ఆదాయపన్నును చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం మొత్తం రూ.ఐదు లక్షలు మించని వారికి చెల్లించాల్సిన ఆదాయపు పన్ను నుంచి మరో రూ.రెండు వేలు మినహాయింపు లభిస్తుంది. 
హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు..
* అండర్‌ సెక‌్షన్‌ 10(13ఏ) ప్రకారం మూడు అంశాల్లో ఏది తక్కువైతే ఆ మొత్తం ఆదాయం నుంచి మినహాయింపు పొందవచ్చు. 
* పొందిన ఇంటి అద్దె మొత్దం. 
* ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం 10 శాతం మూల వేతనం. 
* 40శాతం వేతనం ఇంటి అద్దె అలవెన్స్‌ నెలకు రూ.మూడు వేల కన్నా ఎక్కువ పొందుతున్న వారు మొత్తం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందాలంటే రసీదు డీడీవోకు సమర్పించాలి. 
* చెల్లిస్తున్న ఇంటి అద్దె రూ.లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని పాన్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 
* సొంత ఇంట్లో నివాసం ఉన్న వారికి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు వర్తించదు. 
మినహాయింపులు..
* సెక‌్షన్‌ 24 ప్రకారం హౌస్‌లోన్‌పై వడ్డీపై రూ.రెండు లక్షల వరకు మినహాయింపు ఉంది. 
* భార్య, భర్త ఇద్దరు జాయింట్‌గా రుణం పొందితే ఇద్దరికీ సమానంగా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా రూ.రెండు లక్షలు మినహాయింపు పొందవచ్చు. 
* ఇంటి రుణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుంటే అద్దెకు ఇస్తే ఇంటి రుణంపై వడ్డీ పూర్తిగా మినహాయింపు ఉంటుంది. కాని అద్దెను ఆదాయంగా చూపాలి
* ఉన్నత చదువుల నిమిత్తం విద్యారుణంపై వడ్డీ మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టంగా ఏడేళ్ల వరకు వర్తిస్తుంది. * ఆదాయపన్ను చెల్లించే వారి ఇంట్లో దివ్యాంగులుంటే 80 డీడీ కింద మినహాయింపు ఉంటుంది. 
* వైకల్యం 80శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.75వేలు, 80శాతం అంతకన్నా ఎక్కువ ఉంటే రూ.1.25లక్షలు మినహాయింపు ఉంటుంది. * 80యూ ప్రకారం ఆదాయపన్ను చెల్లించే వ్యక్తి దివ్యాంగులైనా, 80జీ ప్రకారం పీఎం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వంటి వాటికి నూరుశాతం మినహాయింపు ఉంటుంది. 
* ఉద్యోగి తన కుటుంబం, తల్లిదండ్రుల కోసం చెల్లించిన మెడికల్‌ ఇన్సూరెన్స్‌ వేర్వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సొమ్ము గరిష్టంగా రూ.25వేలు, ఉద్యోగి తల్లిదండ్రులకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కోసం చెల్లించిన ప్రీమియం గరిష్టంగా రూ.25వేలు, తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు సీనియర్‌ సిటిజన్‌ అయినా గరిష్టంగా రూ.30వేలు పొందవచ్చు. 
పొదుపు పథకాలపై మదుపు రూ.1.5లక్షలు..
* 80సీ ప్రకారం జీపీఎఫ్, జెడ్పీ జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, జీఐఎస్, ఎల్‌ఐసీ, పీఎల్‌ఐ, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికేట్స్, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్‌ఎస్‌ఎస్, యులిప్స్‌ తదితర పథకాల్లో చేసిన సేవింగ్స్‌లో మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి, స్పౌస్‌ ఉన్నత చదువులకు చెల్లించిన ఫీజు, ఇంటి రుణంపై చెల్లించిన ప్రిన్సిపుల్‌ అమౌంట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇల్లును కొంటే రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లించిన స్టాంప్‌ డ్యూటీ రూ.1.5లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. 
* 80సీ, 80సీసీసీ, 80సీసీడీల పొదుపులపై మొత్తంగా రూ.1.5లక్షలు ఉంటుంది. 
అదనపు మినహాయింపు పొదుపు పథకం..
రాజీవ్‌ గాంధీ ఈక్విటీ సేవింగ్‌ స్కీమ్‌ ద్వారా రూ.1.5లక్షలకు అదనంగా మినహాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయం రూ.పది లక్షల లోపు ఉన్న వారు గరిష్టంగా రూ.50వేల వరకు పొదుపు చేయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో 50శాతం మినహాయిస్తారు. అంటే గరిష్టంగా రూ.25వేలు మినహాయిస్తారు. 
* సేవింగ్స్‌ ఖాతాలో జమ అయిన వడ్డీని ఆదాయంగా చూపిన దాంట్లో నుంచి వడ్డీని గరిష్టంగా రూ.10వేలు వరకు 80టీటీఏ ప్రకారం రూ.1.5లక్షల సేవింగ్స్‌పై అదనంగా రూ.10వేల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement