చిలమత్తూరు : అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికారులపై తమదైన శైలిలో జులుం విదుల్చుతున్నారు. కర్ణాటకలోని చింతామణి, బాగేపల్లి తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో మట్కా రాకెట్‌ను నిర్వహించే వ్యక్తిని స్థానిక పోలీసులు నిఘా ఉంచి పక్కా ప్రణాళికతో కొడికొండ క్రాస్ సమీపంలో రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆయనను విడిపించడానికి కొడికొండకు చెందిన అధికార పార్టీ నేత (ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరుడు) స్థానిక పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఆదివారం రాత్రి మట్కాబీటర్‌ను విడిపించేందుకు పోలీసు అధికారులతో తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి రూ.1.5 లక్షకు సెటిల్‌మెంట్ చేసినట్లు సమాచారం.