డి.హీరేహాళ్ మండలం సోమలాపురం ప్రాథమిక పాఠశాలలో పని చేసే బి.శృతి(27) అనే ఉపాధ్యాయిని మరణించారు.
డి.హీరేహాళ్(రాయదుర్గం) : డి.హీరేహాళ్ మండలం సోమలాపురం ప్రాథమిక పాఠశాలలో పని చేసే బి.శృతి(27) అనే ఉపాధ్యాయిని మరణించారు. ఆమె ఏడు నెలల గర్భిణి కాగా, ప్రతి నెలా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడ్రోజులుగా రక్తస్రావం కావడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అబార్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలోనే ఊంటూ చికిత్స తీసుకున్నారు.
బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ కాకనే ఆమె మృతి చెందారు. ఊపిరి తిత్తుల్లో నీరు ఉండటంతో తల్లీబిడ్డకు ప్రమాదం జరుగుతుందని, ఆబార్షన్ చేస్తే తల్లి అయినా బతుకుతుందన్న ఉద్దేశంతో అబార్షన్ చేసేలోగా ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలికి కూతురు స్వాతి, భర్త ఉన్నారు. కాగా శృతి మృతికి సంతాపంగా పాఠశాలకు బుధవారం సెలవు ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని రాంపురంలో నిర్వహించనున్నట్లు సమాచారం.