
సాక్షి, చెన్నై: పోలీసులు లైంగికంగా వేధించారని నటి శ్రుతి శుక్రవారం తెలిపారు. వివాహం ఆశచూపి ఇంజినీర్లు, కోటీశ్వరులైన యువతను మోసగించినట్లు దాఖలైన కేసులో కోవై పాపనాయకన్‌పట్టికి చెందిన సహాయనటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కోవై జైలులో నిర్బంధించారు. కండిషన్ బెయిలుపై విడుదలైన నటి శ్రుతి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరినీ వివాహం చేసుకుంటానని తెలిపి మోసగించలేదన్నారు. తనను విచారిస్తున్న పోలీసులు లైంగికంగా వేధించారని పేర్కొన్నారు. విచారణ ముగియగానే దీనిపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.