ఎన్నికల సిబ్బందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
సిరిసిల్ల (కరీంనగర్ జిల్లా) : ఎన్నికల సిబ్బందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామ శివార్లలో శనివారం చోటుచేసుకుంది.
ఈ సమయంలో బస్సులో 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారంతా బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన చేపట్టారు.