కనగానపల్లి : తెలంగాణ రాష్ట్ర అధికారులు కనగానపల్లిలో గురువారం పర్యటించారు. గొర్రెల పెంపకం, వాటి పోషణ గురించి అధ్యయనం చేసేందుకు బృందం వచ్చింది. బృందంలో పశుసంవర్థక, రెవెన్యూ అధికారులు ఉన్నట్లు కనగానపల్లి వెటర్నరీ డాక్టర్ గౌసియాబేగం తెలిపారు. జిల్లాలోనే అత్యధికంగా గొర్రెల పెంపకం ఈ మండలంలో ఉందన్నారు. తెలంగాణలోని గద్వేలు నియోజకవర్గ ఆర్డీఓ విజయేంద్ర, పశుసంవర్థక శాఖ ఏడీలు భాస్కరరెడ్డి, యంకన్న బృందంలో ఉన్నారు.
గొర్రెల కాపరులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పశుగ్రాసం కొరత లేదని, అయితే గొర్రెల పోషణ గురించి రైతులకు పెద్దగా తెలియకపోవడంతో ఉత్పత్తి చాలా తక్కువగా ఉందన్నారు. దీంతో ఈ ప్రాంత రైతుల సలహాలతో తమ రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ప్రజల్లో చైతన్యం తీసుకురాన్నట్లు వెల్లడించారు. తరువాత ఈ ప్రాంతంలోని గొర్రెలను కొనుగోలు చేస్తామన్నారు.
కనగానపల్లెలో తెలంగాణ అధికారుల బృందం
Published Thu, Feb 23 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
Advertisement
Advertisement