
ఎస్సై పోస్టుల తుది పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)లో ఎస్సై (మెన్స్), అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (ఎస్‌ఎఫ్‌ఓ) పోస్టులతోపాటు ఎస్సై (కమ్యూనికేషన్/ పీటీఓ) పోస్టులకు తుది పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఫస్ట్ పేపర్(అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్) పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. రెండో పేపర్(జనరల్ స్టడీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వారు నిర్వహించనున్నారు.
దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గి తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు హాల్‌టిక్కెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ ముగిసింది. నేడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ పరీక్ష ప్రారంభమైంది. ఏదైన ఒక ఒరిజినల్ ధ్రువీకరణపత్రం(పాస్‌పోర్టు,పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స) వెంట తెచ్చుకున్న వారిని పరీక్ష హాలు లోకి అనుమతించారు. రేపు ఉదయం ఇంగ్లీష్ పేపర్, మధ్యాహ్నం తెలుగు పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు.