అమెరికాలో ‘అనంత’ తేజం | Telugu Language Commission President elected district dude | Sakshi
Sakshi News home page

అమెరికాలో ‘అనంత’ తేజం

Published Mon, Mar 20 2017 11:15 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో ‘అనంత’ తేజం - Sakshi

అమెరికాలో ‘అనంత’ తేజం

  • తెలుగు భాషా సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికైన జిల్లా వాసి
  • నార్పల /అనంతపురం కల్చరల్‌  : జిల్లాకు చెందిన నామాల వెంకట శివానందరెడ్డి అమెరికా తెలుగు భాషా సంఘానికి అధ్యక్షునిగా వారం రోజుల క్రితం ఎంపికయ్యారు. ఈ మేరకు అమెరికాలో స్థిరపడిన జిల్లా వాసులు సోమవారం వివరాలనందించారు. అమెరికా దేశంలో తెలుగుభాషా సంస్కృతి, కళలు, సాహిత్యం అభివృద్ధికి దోహదపడేందుకు అమెరికాలో స్థిరపడిన తెలుగువారు రెండు దశబ్దాల కిందట ఆస్టిన్‌ నగరంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

    తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటడమే కాకుండా అధికారికంగా గుర్తింపు వచ్చేలా చేయడంలో ఈ సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. సంప్రదాయ తెలుగు పండుగలైన ఉగాది, సంక్రాంతి, దసరా పండుగలను ఈ సంఘం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సంఘానికి నూతన అధ్యక్షునిగా ఎంపికైన  వెంకటశివానందరెడ్డి తండ్రి నామాల సంజీవరెడ్డి నార్పల మండల కేంద్రంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. వెంకట శివానందరెడ్డి నార్పల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989 బ్యాచ్‌లో పదో తరగతి చదివారు. జిల్లా వాసి అమెరికా తెలుగు సంఘానికి అధ్యక్షునిగా ఎంపిక కావడం పట్ల పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి మొరసు సంజీవరెడ్డి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement