వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసి అదనంగా ఉన్న నగదు రూ.65,198ను స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసి అదనంగా ఉన్న నగదు రూ.65,198ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని తమకు ఫిర్యాదులు అందడంతో దాడి నిర్వహించామన్నారు. సుధాకర్ అనే ప్రై వేటు వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులకు దళారీగా వ్యవహరిస్తూ వసూళ్లు చేస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే కొంతమంది స్టాంపురైటర్ల వద్ద కూడా లెక్కకు మించి నగదు ఉండటమే గాక పాత తేదీలకు సంబంధించిన స్టాంపులు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పూర్తి విచారణ అనంతరం సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.