బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట
రూ. 25 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ దే
ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
నిజాంసాగర్ (జుక్కల్ ): ప్రపంచ దేశాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. వ్యవసాయరంగంతో పాటు సంక్షేమ రంగాలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు దక్కిందన్నారు. సీఎం కృషితో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియామకమైన తర్వాత మొదటి సారిగా మంగళవారం నిజాంసాగర్ మండలానికి వచ్చిన హన్మంత్‌షిండేకు మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అధక్షతన సన్మాన సభ నిర్వహించారు.షిండే మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు సన్నబియ్యంతో కూడిన పౌష్టిక ఆహారం వచ్చేనెల నుంచి అందిస్తామన్నారు. జడ్పీచైర్మన్ దఫేదార్ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా చేయించిన సర్వేలో హన్మంత్‌షిండే కామారెడ్డి జిల్లాలో 69.3 శాతం పాయింట్లు సాధించినట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఎమ్మెల్యే మంత్రి పదవితో పాటు మరిన్ని ఉన్నత పదువులు పొందాలని ఆకాంక్షించారు. సమావేశంలో మాగి గాయత్రి కర్మాగారం సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వినయ్‌కుమార్, నాయకులు గైని విఠల్, గడ్డం గంగారెడ్డి, వాజిద్‌అలీ, లింగాల రాంచెందర్, విఠల్, బేగరి రాజు, అహ్మద్ ఉస్సెన్, ఆనంద్‌కుమార్, నర్సింలు, సంఘమేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.