సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభుత్వాధికారులకు తప్ప ప్రజాప్రతినిధులకు అర్థం కాకుండా ఉండేదని శాసనమండలిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. ప్రజలకు బడ్జెట్ అంటే ఇప్పుడే తెలుస్తోందన్నారు. బడ్జెట్‌లో ప్రతీ విభాగాన్ని, ప్రతీ అంశా న్ని పరిశీలించి సీఎం కేసీఆర్ దగ్గరుండి కేటాయింపులు చేశా రన్నారు. బడ్జెట్‌పై మంగళవారం జరిగిన చర్చలో పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడారు.
ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి పథకం దేశంలో ఎక్కడాలేదని ప్రశంసించా రు. రిజిస్ట్రేషన్ సమస్యలు ప్రజలకు ఎక్కువగా ఉండేవని, ప్రతీది ఆన్‌లైన్ చేయడం వల్ల ఒకేరోజులో రిజిస్ట్రేషన్ పూర్తవడం, రెవెన్యూ రికార్డుల్లోకి పేర్లు నమోదవడం జరుగుతున్నాయన్నారు. బిందు సేద్యానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.50 కోట్ల లోపే కేటాయింపులుండేవని, ఇప్పుడు రూ.125 కోట్ల వరకు కేటాయించడం సంతోషకరంగా ఉందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, తదితర ప్రతీ అంశంలో ప్రభుత్వం గుణాత్మకంగా నిధులు కేటాయించిందన్నారు.
కులవృత్తులకు పునర్జీవం..
ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు పగలు, రాత్రి నిద్రలేకుండా కష్టపడుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఉగాది పండుగకు కుటుంబంతో గడపకుండా హరీశ్ కాళేశ్వరం ప్రాజెక్టులోనే గడిపారని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం తెలంగాణది కాగా, నిధుల కేటాయిం పు మొత్తం ఆంధ్రాకే చేసేవారని ఎమ్మెల్సీ పూలరవీందర్ అన్నారు.
గతంలో రాష్ట్ర గోడౌన్ల కెపాసిటీ కేవలం 6 లక్షల టన్నులకే పరిమితమైందని, ప్రస్తుతం 25 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉంచేలా ప్రభుత్వం నిధులు కేటాయించి చర్యలు తీసుకోవడం రైతులకు శుభపరిణామమన్నారు. ఏ రాష్ట్రంలో లేనట్లుగా రూ.25వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించి, నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ అన్నారు. కులవృత్తులకు పునర్జీవం పోస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారని ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment