రాయదుర్గం రూరల్ : రాతిబావివంక గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (52)ఈ నెల 19 నుంచి కనిపించడం లేదని కుమారుడు పురుషోత్తం నాయక్ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ మహానంది సోమవారం తెలిపారు. గేదెలను మేపేందుకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదని, ఎన్ని చోట్ల వెతికినా జాడ కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు.