కల్లూరు: కుటుంబ కలహాలతో దంపతులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చందుపట్ల గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన లోకేష్(28), అశ్విని(22) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
బావిలో దూకి దంపతుల ఆత్మహత్య
Published Sat, Jul 9 2016 10:28 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement
Advertisement