‘గోదావరి ఎక్స్‌ప్రెస్’ దొంగ ఊహాచిత్రం విడుదల | The Godavari Express thief Imagery released | Sakshi
Sakshi News home page

‘గోదావరి ఎక్స్‌ప్రెస్’ దొంగ ఊహాచిత్రం విడుదల

Published Sat, Nov 21 2015 3:39 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

‘గోదావరి ఎక్స్‌ప్రెస్’ దొంగ ఊహాచిత్రం విడుదల - Sakshi

‘గోదావరి ఎక్స్‌ప్రెస్’ దొంగ ఊహాచిత్రం విడుదల

 హైదరాబాద్: గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి నిలుపు దోపిడీ చేసిన అపరిచితులపై నాంపల్లి రైల్వే పోలీసుస్టేషన్‌లో దోపిడీ కేసు నమోదైంది. వీరిలో ఒకరి ఊహా చిత్రాన్ని రైల్వే పోలీసులు విడుదల చేశారు. మత్తు శీతల పానీయాలను సేవించిన ప్రయాణికులు అపస్మారక స్థితిలోకి చేరుకుని హైదరాబాదులోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ప్రయాణికులు కలకత్తాకు చెందిన అంజన్ సర్కార్ (58), అతని భార్య సుభ్ర సర్కార్(58), కుమారుడు సుంక్ సర్కార్ (26)గా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా మత్తు మందు ఇచ్చిన వ్యక్తుల కోసం రైల్వే పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏలూరు-తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్లకు పంపింది.  బాధితులు చెప్పిన వివరాల ప్రకారం ఓ వైద్యుడు ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement