చిలుకూరు బాలాజీ ఆలయ కోనేటిలో పడి ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి సోదరి భర్త రఘునందన్(69)ది తమిళనాడు. బుధవారం చిలుకూరు వచ్చిన ఆయన ఆరోజు సాయంత్రం నుంచి కనిపించలేదు. ఈ విషయమై గోపాలకృష్ణ బుధవారం రాత్రి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రఘునందన్ ఆలయ కోనేటిలో శవమై తేలగా స్థానికులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిలుకూరు కోనేటిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
Published Thu, Oct 1 2015 6:18 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement