
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
మండల పరిధిలోని బిస్మల్లాబాదు గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొని రామిరెడ్డి(48) శుక్రవారం దుర్మరణం చెందాడు.
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని బిస్మల్లాబాదు గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొని రామిరెడ్డి(48) శుక్రవారం దుర్మరణం చెందాడు. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు... హనుమనుగుత్తి గ్రామానికి చెందిన రామిరెడ్డి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఆయన పని మీద గ్రామం నుంచి బైక్‌పై పోట్లదుర్తికి వెళ్లాడు. పని ముగించుకుని మళ్లీ హనుమనుగుత్తికి బయలుదేరాడు. మార్గంమధ్యలో ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.