ఈత మొక్కలతో గీత కార్మికులకు ఉపాధి
-
గీత కార్మికులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు
-
ఖాళీ ప్రదేశాల్లో, పొలాల గెట్లపై ఈత మొక్కలు నాటుకోవాలి,
బిచ్కుంద : ఈత మొక్కలతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తోందని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. శుక్రవారం బిచ్కుంద సౌదర్ చెరువు కట్టపై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు ఖాళీ ప్రదేశాల్లో, పొలాల గెట్లపై ఈత మొక్కలు నాటుకోవాలని, అందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవడానికి సిద్ధంగా ఉందన్నారు. గీత కార్మికులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని వారి అభివృద్ధికి కృషి చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకుటే స్వఛమైన గాలితో అందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. చాలా మంది చెట్లను నరుకుతున్నారు కానీ మొక్కలు నాటకపోవడంతో పచ్చదనం తగ్గి వర్షాలు పడడంలేదన్నారు. కనీసం ఒక వ్యక్తి ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సాయిరాం, రాజుల్లా సర్పంచ్ అశోక్ పటేల్, ఎక్సైజ్ సీఐ సాయన్న, ఎంపీడీవో సాయిబాబా, టీఆర్‌ఎస్ నాయకులు వెంకట్‌రావు, బాబాగౌడ్, బొమ్మల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.