రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణం | The reason for the government's policy of farmer suicides | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణం

Published Wed, Sep 14 2016 12:07 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

The reason for the government's policy of farmer suicides

వర్దన్నపేట  : రైతు ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి హంసరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక భారతి డిగ్రీ కళాశాలలో ఏఐకెఎఫ్‌ డివిజ¯ŒS సదస్సు అవదూత రామన్న అధ్యక్షతన జరిగింది,  ముఖ్య అతిథిగా హారైన ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లలో 2900 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థికసాయం చేయాలన్నా రు. టీఆర్‌ఎస్‌ ఏర్పడిన నాటినుంచి నేటివరకు రైతు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతోపాటు కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని నాలుగు విడతలుగా విడుదల చేస్తుండడంతో బ్యాం కుల్లో, రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సమావేశంలో మంద రవి, నూనె రాజు, ఉడుత భిక్షపతి, ఉడుత కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఐకెఎఫ్‌ డివిజ¯ŒS కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అవదూత రామన్న, కార్యదర్శిగా సముద్రాల భిక్షపతి,  సభ్యులుగా బత్తిని కుమారస్వామి, కర్ర సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డి, మంద కుమారస్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement