డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ఆర్టీసీ డ్రైవర్‌ | The RTC driver caught drunk and drive | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ఆర్టీసీ డ్రైవర్‌

Published Tue, Aug 23 2016 12:16 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

The RTC driver caught drunk and drive

వర్ధన్నపేట : పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఓ ఆర్టీసీ డ్రైవర్‌ పట్టుబడిన సంఘటన పున్నేలు క్రాస్‌ వద్ద సోమవారం జరిగింది. మామునూర్‌ ఏసీపీ ఎస్‌. మహేం దర్‌ నేతృత్వంలో వరంగల్‌ – ఖమ్మం ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తూ డ్రైవర్లను బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షించారు. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం రాత్రి జఫర్‌గడ్‌ మండలంలోని హిమ్మత్‌నగర్‌కు వెళుతోంది. పోలీసులు బస్సును ఆపి ్రౖyð వర్‌ పసుల శంకర్‌కు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా మద్యం తాగినట్లు తేలింది. దీంతోశంకర్‌పై కేసు నమోదు చేసినట్లు వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ వెల్లడించారు. తనిఖీల్లో ఆటో డ్రైవర్‌ సుధాకర్, వాహనదారుడు యాకయ్య డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడగా కేసు నమోదు చేసినట్లు తెలి పారు. పోలీసు బృందంలో రాయపర్తి ఎస్సై శ్రీధర్, పీఎస్సైలు వెంకటకృష్ణ, వెంకటప్ప, సిబ్బంది పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement