అనంతపురం మెడికల్ : జిల్లాలో విష జ్వరాలు, డెంగీ తీవ్రత ఉన్న నేపథ్యంలో సర్వజనాస్పత్రి యాజమాన్యం, కలెక్టర్ కోన శశిధర్‌లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (డీఎంఈ), అకడమిక్ డీఎంఈ, కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి సిబ్బంది కొరత విషయం తీసుకెళ్లారు. దీంతో కర్నూలు నుంచి సీనియర్ రెసిడెంట్లు డాక్టర్ వంశీ, వంశీ చైతన్య, కార్తీక్‌రెడ్డిలను ఇక్కడికి పంపారు.
శనివారం ఆస్పత్రికి వచ్చిన వీరు మధ్యాహ్నం వరకు విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. వీరిలో ఇద్దరిని పీడియాట్రిక్ విభాగానికి, ఒకరిని జనరల్ మెడికల్ విభాగానికి వేశారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సంబంధిత హెచ్‌ఓడీలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జ్వరంతో వచ్చిన చిన్నారులకు ఉన్న డాక్టర్లే వైద్య సేవలు అందించాల్సి పరిస్థితి. ఈ క్రమంలో సోమవారం సంబంధిత హెచ్‌ఓడీలు విషయాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ దృష్టికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం నుంచి వాళ్లు విధులకు రాలేదని తేల్చారు. ఈ క్రమంలో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎంఈకి లేఖ రాశారు.