జడ్జి ఇంట్లో చోరీ..! | theft in judge home | Sakshi
Sakshi News home page

జడ్జి ఇంట్లో చోరీ..!

Published Tue, Sep 6 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

జడ్జి ఇంట్లో చోరీ..!

జడ్జి ఇంట్లో చోరీ..!

మిర్యాలగూడ అర్బన్‌ : గుర్తు తెలియని వ్యక్తులు జడ్జి ఇంటి తాళాలు పగులకొట్టి చోరీ చేసిన సంఘటన పట్టణంలోని విద్యానగర్‌ కాలనీ సబ్‌జైల్‌ ఎదురుగా సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని విద్యానగర్‌ కాలనీలో గల సబ్‌జైల్‌ ఎదురుగా నివాసముంటున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి అగ్నూరు నాగరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ప్రహరీని దూకి తాళం పగులకొట్టారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంట్లోని బీరువాను తెరిచి అందులోని వస్తువులను చిందర వందరగా పడేశారు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగువారు ఇంటి తాళం పగులకొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వన్‌ టౌన్‌ సీఐ దూసరి భిక్షపతి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. నల్లగొండ నుంచి ప్రెత్యేక టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. కాగా ఈ సంఘటనలో ఎలాంటి వస్తువులు చోరికి గురి కాలేదని సమాచారం. కాని జడ్జి కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవడంతో చోరీ ఎంత జరిగిందనే విషయం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement