తాళం వేసిన ఇంట్లో చోరీ
-
11 సవర్ల బంగారు, రూ.4 లక్షల నగదు అపహరణ
నెల్లూరు రూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన గుడిపల్లిపాడు, జన్నత్‌హుస్సేన్‌నగర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు..జన్నత్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన అజీజ్ తన భార్యను కాన్పు నిమిత్తం నెల్లూరులోని ఓ హాస్పిటల్లో ఈ నెల 27న అడ్మిట్ చేశారు. శనివారం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి కనిపించాయి. ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. బీరువాలోని 11 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై సుబ్బారావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.