ఇస్లాంలో ఉగ్రవాదానికి స్థానంలేదు | There is no Place to Terrarissam in ISLAM | Sakshi
Sakshi News home page

ఇస్లాంలో ఉగ్రవాదానికి స్థానంలేదు

Published Sun, Aug 7 2016 9:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

మాట్లాడుతున్న ఖలీల్‌ అహ్మద్‌

మాట్లాడుతున్న ఖలీల్‌ అహ్మద్‌

షాద్‌నగర్‌: ఇస్లాంలో ఉగ్రవాదానికి, దాడులకు స్థానం ఉండదని షేకుల్‌ జామే నిజామ్మియా హైదరాబాద్‌ దక్కన్‌ ముఫ్తి ఖలీల్‌ అహ్మద్‌ అన్నారు. రంజాన్‌ మాసంలో మక్కా మదీనాలో బాంబ్‌ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ ఆదివారం ఫరూఖ్‌నగర్‌ మజీద్‌లో ముస్లింలు నిరసన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖలీల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ఇస్లాం అంటే శాంతి అని, ఇస్లాం ముసుగులో కొందరూ మసీదులు, దర్గాలు, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ముస్లింలందరూ ఈ చర్యలను ఖండించాలన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడి చోటుచేసుకున్నా తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో సయ్యద్‌ రవూఫ్, పీర్‌షబ్బీర్, మహ్మద్‌ తాహేర్‌ ఖసీమీ, సయ్యద్‌ మున్వర్‌అలీ, అబ్దుల్‌ ఖదీర్, సయ్యద్‌ అస్రద్‌ అలీ, అజిజుల్లా షా ఖాదిరి, ముకారర్‌ అలీ, మసూద్‌ఖాన్, సయ్యద్‌ కమ్మర్, సలీం, అన్ను తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement