దొంగతనాల ముఠాలు కనిపిస్తే కాల్చివేతే: డీఎస్పీ
చీరాల అర్బన్: రైళ్లలో ఎలాంటి దోపిడీ, దొంగతనాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జీఆర్పీ నెల్లూరు డీఎస్పీ మోహన్‌రావు తెలిపారు. చీరాల రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. చీరాల జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నేరాలు, యూక్సిడెంట్లు, దొంగతనాల వివరాలు ఎస్సై రామిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రైళ్లలో రాత్రి వేళలో గస్తీ ముమ్మరం చేశామన్నారు. దొంగతనాలకు పాల్పడే ముఠా కనిపిస్తే కాల్చివేసేందుకూ ఉత్తర్వులు అందాయన్నారు. ప్రయూణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని రైళ్లలో సిబ్బందిని నియమించామన్నారు. జిల్లాలో దొంగతనం కేసులో అనంతపురం ముఠాను అరెస్ట్ చేశామన్నారు. రాజస్తాన్, అస్సాం ప్రాంతాలకు చెందిన ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నామన్నారు. ఒంగోలు జీఆర్పీ సీఐ దశరథరామారావు, ఎస్సై రామిరెడ్డి ఉన్నారు.