
కాల‍్వలో పడి ముగ్గురి అనుమానాస‍్పద మృతి
నిజామాబాద్: జిల్లాలోని మాక్లూరు మండలం బోర్గం శివారులో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామం శివారులో ఉన్న కాల్వలో పడి ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు సాయికుమార్(40), దివ్య(30), వర్షిణి(2)గా గుర్తించారు. స్థానికులు ఆదివారం ఉదయం కాల‍్వలో మృతదేహాలు తేలుతుండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అయితే దివ‍్య, వర్షిణి తల్లీబిడ‍్డలని, సాయికుమార్ నిజామాబాద్‌కు చెందినవాడని స్థానికులు చెబుతున్నారు. వివాహేతర సంబంధం వల‍్లే మనస్థాపం చెంది వీరు కాలువలో దూకి ఆత‍్మహత‍్య చేసుకుని ఉంటారని ఒక వాదన కాగా ఎవరైనా వీరిని హతమార్చి కాలువలో పడేశారా అన‍్న అనుమానాలు కూడా వ‍్యక‍్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.