డిండి మండలం బొగ్గులదొన సర్పంచి ఉప ఎన్నిక నువ్వానేనా అన్నట్లు సాగింది.
నల్లగొండ జిల్లా డిండి మండలం బొగ్గులదొన పంచాయతీ సర్పంచి పదవికి గురువారం నిర్వహించిన ఉప ఎన్నిక నువ్వానేనా అన్నట్లు సాగింది. సర్పంచి వరికుప్పల జంగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందటంతో అధికారులు గురువారం ఉప ఎన్నిక జరిపారు. జంగయ్య భార్య జయమ్మ తన సమీప ప్రత్యర్థి తండు వెంకటయ్యపై 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.