యువత స్వయం ఉపాధి పొందాలి
నల్లగొండ రూరల్ : నిరుద్యోగులు స్వయం ఉపాధితో మరొకరికి ఉపాధి కల్పించవచ్చని ఎస్‌బీహెచ్ రైసెట్ సంస్థ డైరెక్టర్ ఎన్.సి.శ్రీధర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు బ్యూటీపార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ బేసిక్స్‌పై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంగళవారం సంస్థ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు.
నల్లగొండ రూరల్ : నిరుద్యోగులు స్వయం ఉపాధితో మరొకరికి ఉపాధి కల్పించవచ్చని ఎస్‌బీహెచ్ రైసెట్ సంస్థ డైరెక్టర్ ఎన్.సి.శ్రీధర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు బ్యూటీపార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ బేసిక్స్‌పై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంగళవారం సంస్థ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వివిధ అంశాలపైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిన్నచిన్న శిక్షణలతో స్వయం ఉపాధి లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వేణు, వాల్యానాయక్, జనార్దన్, స్వర్ణలత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.