బదిలీలలు
►మారని విద్యాశాఖ వైఖరి
► ఉపాధ్యాయ బదిలీలకు నేడు ఆఖరు
►సవరణలతో గందరగోళం
► ఓపెన్‌కాని వెబ్‌సైట్
►ఆందోళనలో ఉపాధ్యాయులు
మదనపల్లె సిటీ : విద్యాశాఖ వైఖరి మారనంటోంది. ఒక్క బదిలీల్లోనే సవాలక్ష మార్పులు చేసి ఉపాధ్యాయులకు చుక్కలు చూపించడం షరామామూలైపోతోంది. రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు జీవో నెం.190ను గురువారం విడుదల చేశారు. ఇందులో బదిలీలకు సంబంధించి అనేక సవరణలు ఉన్నాయి. వీటిని సరిచేసుకునేందుకు ఉపాధ్యాయులు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది.
వెబ్‌సైట్ వెతలు
బదిలీలకు సంబంధించిన విద్యాశాఖ వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 3 నుంచి 7 వరకు ఎన్‌టైటిల్‌మెంట్‌లో రీ జనరేషన్ చేసుకోవాలి. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో 17 వేల మంది ఉ పాధ్యాయులు ఉండగా తప్పనిసరిగా ఆరు వేల మంది, రెండు విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్నవారు మరో నాలుగు వేల మంది బదిలీలకు అర్హులు. బదిలీలకు సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో దాదాపు పదివేల మంది అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.
బదిలీల్లో సవరణలు ఇవే
►2015 బదిలీల కౌన్సెలింగ్‌లో కోరుకొని రిలీవ్ కాని వారిని ఈ బదిలీల కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు
►ఒకడీఎస్సీలోఎస్‌జీటీగా.. మరో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికైన వారికి ఎస్‌జీటీ సర్వీస్ పాయింట్లు ఇస్తారు
►వర్క్ ఎడ్జస్ట్‌మెంట్‌లో ఎస్‌ఎస్‌సీ డీల్ చేసిన వారికి కూడా పాయింట్లు వర్తిస్తాయి.
► బదిలీ ఉపాధ్యాయులకు వారి మొదటి నియామకపు తేదీ నుంచి సర్వీస్ పాయింట్లు ఇస్తారు
► ప్రిఫరెన్షియల్ కేటగిరి 8 అకడమిక్ సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించుకోవచ్చు
►2015 బదిలీల్లో కోరుకొని ఇప్పుడు రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయిన వారికి పూర్వపు స్టేషన్ పాయింట్లు ఇస్తారు
►సర్‌ప్లస్ టీచర్లను అవసరమున్న జిల్లా పరిషత్ స్కూళ్లలో సర్దుబాటు చేయవచ్చు.
►కౌన్సెలింగ్ హాలులోకి ఉపాధ్యాయ సంఘాలను అనుమతించాలి
ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ హాలు లోకి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల ను అనుమతించాలి. కౌన్సెలింగ్‌లో ఎలాం టి అక్రమాలు జరగకుండా ఉండాలంటే ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు కూడాఉంటే నిజాయితీగా జరిగే అవకాశం ఉంది.
–పి.ఢిల్లీప్రసాద్, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి
నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
చిత్తూరు ఎడ్యుకేషన్ : కలెక్టరేట్ ఎదుట టీచర్ల సమస్యలపై ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీల్లో సమస్యలు మున్సిపల్ టీచర్ల సమస్యల కోసం ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.