ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే రాజకీయాల్లోకి ...
జాలాది గొప్ప భావాలు కల రచయిత
సినీ నటి కవిత
విశాఖపట్నం : తన సినీ జీవితం తన సంతృప్తినిచ్చిందని ప్రముఖ సినీ నటి కవిత అన్నారు. గురువారం మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో నివాసముంటున్న జాలాది రాజారావు కుమార్తె జాలాది చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, విశాఖ సినీ కాళాకారుల సంక్షేమ సంఘం గౌరవధ్యక్షురాలు జాలాది విజయ ఇంటికి ఆమె విచ్చేశారు. జాలాది రాజారావు భార్య ఆగ్నేసమ్మతో ముచ్చటించారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను పదేళ్ల వయసులోనే సినిమాల్లో నటించడం మొదలు పెట్టానని అన్నారు.
ఇప్పటి వరకు 280 సినిమాల్లో నటించాన్నారు. ఎన్‌టీ రామారావుపై ఉన్న అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఆయనతో కలసి పనిచేయడం గొప్ప అనుభవమన్నారు. నాన్న జాలాది రాజారావుతో మంచి అనుబంధం ఉందని, ఇపుడు ఆయన లక్షణాలు పుణికి పుచ్చకున్న విజయను కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కవితను దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ 42వ వార్డు అధ్యక్షుడు కామాకుల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి మందలపు వాసుదేవరావు, స్నేహాంజలి గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.ఎన్.మూర్తి పాల్గొన్నారు.