కూర్మాల మృత్యుఘోష..!!
కోడూరు : సముద్రంలో సందడి చేసే భారీ తాబేళ్లు హంసలదీవి బీచ్ దగ్గర నుంచి నాగాయలంకలోని ఎదురుమొండి వరకు సాగరతీరం వెంట నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాతకు గురవుతున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల మరపడవలకు కింద భాగంలో ఉండే ఫ్యాన్ రెక్కలు తాబేళ్లకు తగిలి మృతిచెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆదివారం సాగరసంగమం ప్రాంతంలో సుమారు పది తాబేళ్ల కాళేబరాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. తాబేళ్లను పునరుత్పత్తి చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారులు, వాటి సంరక్షణ కోసం ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదని పర్యటకులు ఆరోపించారు. మత్స్యకారులకు తగిన సూచనలిచ్చి తాబేళ్ల ఉనికిని కాపాడాలని పలువురు కోరుతున్నారు.