ట్రాఫిక్‌తో తంటాలు | traffic problems | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌తో తంటాలు

Published Sun, Sep 4 2016 10:17 PM | Last Updated on Mon, Oct 8 2018 7:44 PM

పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా - Sakshi

పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా

  • రాందాస్‌ చౌరస్తా ట్రాఫిక్‌ కిరికిరి
  • నిత్యకృత్యంగా మారిన సమస్య
  • ఇబ్బందుల్లో వాహనదారులు
  • అలంకారప్రాయంగా సిగ్నల్స్‌ వ్యవస్థ
  • తరచూ ప్రమాదాలు జరుగుతున్నా  ఎమి పట్టని అధికారులు
  • మెదక్‌ మున్సిపాలిటి: నాలుగు జిల్లాలకు సుభాగా వెలుగొందిన మెదక్‌ పాలకుల నిర్లక్ష్యంతో నేడు సమస్యలతో సతమతమవుతోంది. పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుండటంతోపాటు జనాభా పెరుగిపోతుంది. దీంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు ఇరుకుగా మారి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు సమస్యలను గాలికొదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

    సమస్య పరిష్కరిస్తామంటూ గతంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేసిన అధికారులు వాటి నిర్వహణను మర్చిపోయారు. దీంతో పట్టణంలో ప్రజలకు ట్రాఫిక్‌ సమస్య తప్పడం లేదు. పట్టణ నడిబొడ్డు గల రాందాస్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ సమస్య ప్రజలను వేధిస్తోంది. మెదక్‌ పట్టణంలోని ప్రధాన రహదారిలో నిత్యం వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణాన్ని ఆనుకొని ఉన్న పరిసర గ్రామాల నుంచి, పక్క మండలాల నుంచి విద్యార్థులు చదువుల కోసం, వ్యాపార నిమిత్తం ప్రజలు అధిక సంఖ్యలో మెదక్‌ పట్టణానికి వస్తుంటారు.

    దీంతో రాందాస్‌ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలో సమస్య మరి ఎక్కువగా ఉంటుంది.గంటలతరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్నారు. ఇక్కడి చౌరస్తాలో  ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటించి వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా గతంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అది అలంకార ప్రాయంగానే ఉంది.

    ట్రాఫిక్‌ సిబ్బంది లేకపోవడమే ప్రదాన కారణం
    చౌరస్తాలో ట్రాఫిక్‌ సిబ్బంది లేకపోవడంతో సమస్య పెరిగిపోతోంది. సిబ్బంది ఉఏంటే కొంతవరకైనా సమస్యలను పరిష్కరించవచ్చు కాని ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అంతేగాక సిగ్నల్స్‌ లేకపోవడంతో కూడా సమస్య ఎక్కువవుతుంది.చౌరస్తా గుండా వాహనదారులు అడ్డదిడ్డంగా వెళ్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య నిత్యకృత్యంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

    అంతేకాకుండా చౌరస్తా విస్తీర్ణం చిన్నగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకల సమస్యలు తరచూ ప్రమాదాలు జరగాడానికి కారణంగా తయారవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో రాందాస్‌ చౌరస్తాలో నిర్మించిన దిమ్మెకు భారీ వాహనాలు ఢీకొట్టిన సంఘటనలు కోకొల్లలు.

    నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతున్న సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని  ప్రజలు వాపోతున్నారు.ట్రాఫిక్‌ సమస్య ఇంతగా వేధిస్తోన్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు.ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జమజ్య జటిలమవుతుందే కాని పరిష్కరం లభించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు , ప్రజలు   కోరుతున్నారు.

    ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను వినియోగంలోకి తేవాలి
    లక్షకుపైగా జనాభా గల  మెదక్‌ పట్టణ నడిబొడ్డున గల రాందాస్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంది. చౌరస్తా విస్తీర్ణం కూడా తక్కువగా ఉంది. దీనికి తోడు పరిసరాల్లో తోపుడు బండ్లను పెట్టడం వల్ల సమస్యగా ఉంటోంది. అదేకాకుండా భారీ వాహనాలతో కూడా సమస్య ఎక్కువవుతుంది.దీంతో ప్రమాదాలు .రగాడానికి కారణమవుతున్నాయి.    దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వినియోగంలోకి తీసుకురావాలి.  ఫలితంగా కొంతమేర సమస్య తీరే అవకాశం ఉంది. - సయ్యద్‌ ఆరీఫ్‌ అలీ, పాన్‌షాప్‌ వ్యాపారి, మెదక్‌

    రాందాస్‌ చౌరస్తాను వెడల్పు చేయాలి
    పట్టణంలో ప్రధాన కూడలి అయిన రాందాస్‌ చౌరస్తా విస్తీర్ణం మరీ చిన్నగా ఉంది. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతుంది. జిల్లాకేంద్రం ఏర్పాటుతున్న తరుణంలో చౌరస్తా విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఎంతైన ఉంది. అలాగే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వినియోగంలోకి తీసుకొచ్చి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలి. - శ్యామ్, స్థానికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement