బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం ఐటీడీఏలో గిరిజన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పీవో ఎస్.షణ్మోహన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గిరిజన అభ్యర్థులకు శిక్షణ
Aug 16 2016 11:29 PM | Updated on Mar 28 2019 6:31 PM
బుట్టాయగూడెం : బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం ఐటీడీఏలో గిరిజన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పీవో ఎస్.షణ్మోహన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఏడీ / సీఏఎం అభ్యర్థులకు బుధవారం నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 19 నుంచి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సీఏడీ/ సీఏఎం శిక్షణకు అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణలై వయసు 18 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. కానిస్టేబుల్ శిక్షణకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలని, 18 నుంచి 26 ఏళ్ల వయసు ఉండాలని తెలిపారు. శిక్షణ కాలం రెండు నెలలు ఉంటుందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆధార్ కార్డు, దరఖాస్తు చేసుకున్న రసీదు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో శిక్షణకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99595 36789, 89856 17583, 94933 20944లో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement