అమర వీరులకు కొవ్వొత్తులతో సంతాపం తెలుపుతున్న విద్యార్థులు
పాతపట్నం: కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో మృతి చెందిన జవాన్లకు కిరణ్మయి డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం రాత్రి కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. జవాన్లకు అమర్ రహా అంటు నినాదాలు చేశారు. ముందుగా అమర వీరుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.మానస, అధ్యాపకులు పాల్గొన్నారు.