: హుస్సేనుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో వీర జవాన్లుకు అంజలి ఘటిస్తున్న ఉపాధ్యాయులు,విద్యార్థులు
వీరఘట్టం : జమ్ము–కశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన జైషేమహమ్మద్ తీవ్రవాద సంస్థ జరిపిన పాశవిక దాడిలో మృతి చెందిన 18 మంది వీర జవాన్లు ఆత్మకు శాంతి చేకూరాలని మండలంలోని హుస్సేనుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మంగళవారం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇటువంటి పిరికి పంద చర్యలను ఖండించారు. కార్యక్రమంలో హెచ్.ఎం కె.టి.టి.వి.పోలినాయుడు, ఉపాధ్యాయులు జి.వరప్రసాద్, ఎల్.కల్పన, ఎం.రవికుమార్, వై.సూరిబాబు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.