kashmir attacks
-
Targeted Attacks: కశ్మీర్లో నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మైనార్టీలు, వలస కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. షోపియాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేయగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులు జరగటం భయానక పరిస్థితులను తలపిస్తోంది. షోపియాన్‌లోని హర్మెన్ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపైకి టెర్రరిస్టులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్, మోనిశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడి నేపథ్యంలో హర్మెన్ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణంలో కూలీలపైకి గ్రెనేడ్ విసిరింది ఇమ్రానే అని తేలింది. గత శనివారం ఇదే షోపియాన్ ప్రాంతంలో పురాన్ క్రిషన్ భట్(56) అనే కశ్మీరీ పండిట్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్ గ్రామంలో పూరాన్ భట్ తన ఇంటి వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భట్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రకటించింది. భట్ హత్యతో కశ్మీర్ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు సెప్టెంబర్ 2న మునీర్ ఉల్ ఇస్లామ్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు: కుంకుమ-పసుపు క్లూస్.. పూజలు వికటించడంతో కక్షగట్టి! -
అమర జవాన్లకు జోహార్లు
పాతపట్నం: కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో మృతి చెందిన జవాన్లకు కిరణ్మయి డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం రాత్రి కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. జవాన్లకు అమర్ రహా అంటు నినాదాలు చేశారు. ముందుగా అమర వీరుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.మానస, అధ్యాపకులు పాల్గొన్నారు. -
వీరజవాన్లకు ఘన నివాళులు
వీరఘట్టం : జమ్ము–కశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన జైషేమహమ్మద్ తీవ్రవాద సంస్థ జరిపిన పాశవిక దాడిలో మృతి చెందిన 18 మంది వీర జవాన్లు ఆత్మకు శాంతి చేకూరాలని మండలంలోని హుస్సేనుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మంగళవారం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇటువంటి పిరికి పంద చర్యలను ఖండించారు. కార్యక్రమంలో హెచ్.ఎం కె.టి.టి.వి.పోలినాయుడు, ఉపాధ్యాయులు జి.వరప్రసాద్, ఎల్.కల్పన, ఎం.రవికుమార్, వై.సూరిబాబు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
అమరులైన సైనికులకు స్వస్ధలంలో ఘనంగా నివాళులు