గూడూరుపాడు..గడగడ | trs and cpi party Activists fight and challanging each other | Sakshi
Sakshi News home page

గూడూరుపాడు..గడగడ

Published Fri, Jun 3 2016 4:17 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

గూడూరుపాడు..గడగడ - Sakshi

గూడూరుపాడు..గడగడ

సీపీఐ కార్యకర్తలపై చర్య తీసుకున్నాకే సంగం మృతదేహం
తరలించాలంటూ పోలీసులకు
అడ్డుతగిలిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు

 సీపీఐ, టీఆర్‌ఎస్ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ...కర్రలు, బడితెలతో బాదుకోవడంతో గూడూరుపాడు గడ గడలాడిపోరుుంది. గంటపాటు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. గ్రామ పరిసరాలన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపించారుు. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో గురువారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జెడ్పీచైర్‌పర్సన్  గడిపల్లి కవిత హాజరయ్యూరు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చేక్రమంలో సీపీఐ,టీఆర్‌ఎస్ వర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సీపీఐ కార్యకర్తల వైపు నుంచి వచ్చిన ఓ రాయి..టీఆర్‌ఎస్ కార్యకర్త సత్తి సంగం గుండెల్లో బలంగా తగలడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో మృతుడి సోదరుడు జానకితో పాటు కార్యకర్తలు గోకినపల్లి రామ్మూర్తి, మహేష్, సైదమ్మ, కుర్రి తిరుపతిరావు, లిక్కి కోటేశ్వరరావు, ఎర్రబోయిన సతీష్, కుర్రి మారుతిలకు గాయాలయ్యాయి.        - ఖమ్మం రూరల్

 గొడవ సమాప్తం..అంతా నిశ్శబ్దం
గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత టీఆర్‌ఎస్ వారు బాణసంచా కాలుస్తుండగా నిప్పు రవ్వలు మీద పడ్డాయంటూ సీపీఐ వారు గొడవకు దిగడంతో..ఇరు వర్గాల వారు గంటపాటు రాళ్లు రువ్వుకొని కొట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన సత్తి సంగం (60) ఈ గొడవల్లో మరణించడంతో..ఊరిలో భయానక వాతావరణం నెలకొంది. ఘర్షణ అనంతరం రెండు బెటాలియన్ల పోలీసులు ఊరిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీధివీధినా తిరుగుతూ..గుంపులుగా సంచరించకుండా ఆంక్షలు విధించడంతో అంతా నిశ్శబ్దం నెలకొంది. ఈ గొడవలో మృతుడి సోదరుడు జానకీరామ్‌తో పాటు మరో ఎనిమిది మంది గాయపడగా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

దాడి ఘటనలో 30మందిపై కేసు
గూడూరుపాడులో ఘర్షణ ఘటన, టీఆర్‌ఎస్ కార్యకర్త సత్తి సంగం  మృతికి సంబంధించి సీపీఐకి చెందిన 30మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎస్.ఆంజనేయులు తెలిపారు. సిద్ధినేని కర్ణకుమార్, చింతకాయల కమలాకర్‌తో పాటు మరో 28మందిపై కేసు పెట్టినట్లు తెలిపారు.

పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం..
సత్తి సంగం కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతడికి భార్య పుల్లమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకమ్మాయికి పెళ్లి అయింది. ఇంకో కూతురు ఇంట్లోనే ఉంది. కూలి పనులకు పోతూ..అప్పుడప్పుడూ మాంసం కొట్టు నిర్వహిస్తూ కుటుంబాన్ని సాకాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి ఇలా ఘర్షణలో ఎవరో విసిరిన రాయి గుండెలపై తగిలి విలవిల్లాడి ఊపిరొదలడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది.

అతి సమస్యాత్మక ‘గూడు’
ఖమ్మం రూరల్ మండలంలో గూడూరుపాడు అతి సమస్యాత్మక గ్రామంగా పేరొందింది. మండలంలో చింతపల్లి, ఆరెకోడు, గుదిమళ్ల, కైకొండాయిగూడెం, ఎం.వెంకటాయపాలెం అతి సమస్యాత్మక ఊర్లుగా ఉన్నా..గూడూరుపాడులో ఎప్పుడూ ఏదోఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. గ్రామంలో రెండు వేల జనాభా ఉండగా..పార్టీలు, వర్గాల వారీగా పరస్పరం కక్షలు ఉన్నాయి. కొందరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొనడంతోనే ఈ ఘర్షణ నెలకొందని స్థానికులంటున్నారు.

 గతంలో జరిగిన కొన్ని గొడవల వివరాలు..
2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికలప్పుడు బందోబస్తు కోసం వెళ్లిన పోలీసు సిబ్బందితో గొడవ జరగ్గా..ఓ పీసీ తల పగిలింది.

ఇటీవల తుమ్మల పాలేరు ఎన్నికల ప్రచారంలో ఇక్కడికొచ్చినప్పుడు సీపీఐ కార్యాలయాన్ని సందర్శిస్తే..టీఆర్‌ఎస్‌లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

గతంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నేత వర్ధంతి సభ సందర్భంగా సీపీఎం, సీపీఐకు మధ్య ఘర్షణ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement