లక్కీడిప్‌ను అడ్డుకున్న టీఎస్‌ఎఫ్
Published Sat, Jun 10 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
కర్నూలు(అర్బన్): బెస్ట్ అవేలబుల్స్ స్కూల్్సలో గిరిజన విద్యార్థులకు సీట్లు పెంచాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ చంద్రప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో గిరిజన చిన్నారులకు 3,5,8 తరగతుల్లో ప్రవేశం కల్పించేందుకు లక్కీడిప్ నిర్వహించారు. సీట్లు పెంచిన తర్వాత డిప్ నిర్వహించాలంటూ టీఎస్‌ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తామని, ప్రవేశాలకు ఆటంకం కలిగించవద్దని జేసీ–2 ఎస్ రామస్వామి కోరారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ 2015–16లో 115 సీట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుతం 56 సీట్లతో సరిపెట్టడం దారుణమన్నారు. గతేడాది మిగిలిపోయిన 21 సీట్లు, 10వ తరగతి పూర్తి చేసిన 19 మంది విద్యార్థుల సీట్లను కలుపుకొని 56 సీట్లను కేటాయించడం గిరిజన చిన్నారులను మోసం చేయడమేనన్నారు. బీఏఎస్‌లో గిరిజన విద్యార్థులకు సీట్లు పెంచేంతవరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. టీఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీ వెంకటేష్, ఉపాధ్యక్షుడు ఆర్ రామరాజు, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర పాల్గొన్నారు.
Advertisement