ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్) 9వ వార్షిక సభను ఈనెల 29నఓయూలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కోట శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ఆర్ట్స్ కళాశాల ఎదుట వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీవీఎస్ విద్యార్థి సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.
యూనివర్సిటీ ఐసీఎస్‌ఎస్ హాలులో జరిగే సభలో గద్దర్, విరసం నేత కళ్యాణ్‌రావు, టీపీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ, పాశం యాదగిరి, సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్, డాక్టర్ కాశీం తదితరులు ప్రసంగించనునట్లు తెలిపారు.
ఓయూలో టీవీఎస్ సభ
Published Sun, Sep 27 2015 10:17 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM
Advertisement
Advertisement