కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ప్రాణాలొదిలాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మూల్కనూరు గ్రామంలో నేటి ఉదయం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీనితోపాటు పిడుగుపడింది. ఆ ప్రదేశంలోనే ఉన్న కాడెడ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత రైతు కనకయ్య కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎద్దుల విలువ రూ. 70 వేలు ఉంటుందని రైతు తెలిపారు.
పిడుగుపాటుకి ఎద్దులు మృతి
Published Tue, Aug 11 2015 11:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement
Advertisement