
రైలు కిందపడి ఇద్దరు మృతి
గిద్దలూరు(ప్రకాశంజిల్లా): రైలు కిందపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున గిద్దలూరు మండలంలోని కృష్ణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. మృతుల్లో ఒకరు అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటకు చెందిన వ్యక్తిగా రైల్వే పోలీసులు గుర్తించారు.
ఇరవై సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.