కమిషనరేట్‌ పరిధిలోకి రెండు జిల్లాలు | Two districts under the jurisdiction of police commissionarate | Sakshi
Sakshi News home page

కమిషనరేట్‌ పరిధిలోకి రెండు జిల్లాలు

Published Thu, Sep 1 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

కమిషనరేట్‌ పరిధిలోకి రెండు జిల్లాలు

కమిషనరేట్‌ పరిధిలోకి రెండు జిల్లాలు

  • వరంగల్, హన్మకొండ జిల్లాలు పూర్తిగా...
  • మానుకోట, భూపాలపల్లిలో ఎస్పీ కార్యాలయాలు
  • పోలీసు శాఖలో వేగంగా పునర్విభజన
  • పూర్తిగా మారనున్న స్వరూపం
  •  
    సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : జిల్లాల పునర్విభజనతో పోలీసు శాఖ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ఆ శాఖ పునర్విభజనపై ఉన్నత స్థాయిలో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్‌ రెవెన్యూ జిల్లాలోని వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి మల్లారెడ్డి నియమించింది. వరంగల్‌ జిల్లాను.. వరంగల్, హన్మకొండ, జయశంకర్‌(భూపాలపల్లి), మహబూబాబాద్‌ జిల్లాలుగా పునర్విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలోనూ విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
     
    మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు పోలీసు శాఖ పరంగా ప్రత్యేకంగా ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ముసాయిదాలో పేర్కొన్న మండలాల పరిధిలోని పోలీస్‌ స్టేషన్లను మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోకి తీసుకువస్తున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ప్రత్యేకంగా రూరల్‌ విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల అదనంగా ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముసాయిదాలో పేర్కొన్న వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని అన్ని పోలీస్‌ స్టేషన్లను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 
     
    – వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో 19 సాధారణ పోలీస్‌స్టేషన్లు, మూడు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌స్టేషన్, ఒక క్రైం పోలీస్‌స్టేషన్‌ ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్‌స్టేషన్లు, ఒకటి మహిళా పోలీస్‌స్టేషన్, ఒకటి క్రైం పోలీస్‌స్టేషన్‌ ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో ఇదంతా పూర్తిగా మారిపోనుంది. 
     
    – వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌లో పరిధిలో ప్రస్తుతం ఉన్న 19 స్టేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం వరంగల్‌ రూరల్‌ పోలీస్‌ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల స్టేషన్లు పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి రానున్నాయి. 
     
    – ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కరీంనగర్‌ జిల్లాలోని ఐదు మండలాలు కలుస్తున్నాయి. ఇలా హన్మకొండలో కలుస్తున్న మండలాల్లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్‌ టౌన్, హుజూరాబాద్‌ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్‌ పోలీస్‌ స్టేషన్లు వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో కలపనున్నారు.
     
    పోలీసు శాఖ ప్రస్తుత స్వరూపం...
    వరంగల్‌ కమిషరేట్‌ : హన్మకొండ, కేయూసీ, సుబేదారి, మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్, మామునూరు, జఫర్‌గఢ్, రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, హసన్‌పర్తి, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్‌.
     
    వరంగల్‌ రూరల్‌ : జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం, నర్మెట, చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు, సీరోలు, కురవి, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, మహబూబాబాద్‌ టౌన్, మహబూబాబాద్‌ రూరల్, గూడూరు, కొత్తగూడ, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, మొగుళ్లపల్లి, రేగొండ, చిట్యాల, భూపాలపల్లి, గణపురం, వెంకటాపురం, ములుగు, పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement