ఖమ్మం : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు పూర్తిగా దగ్థం కావడంతో లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.