నిజామాబాద్‌లో రెండు దొంగతనాలు | two robberies in Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో రెండు దొంగతనాలు

Published Thu, Jun 23 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

two robberies in Nizamabad

 నిజామాబాద్జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌లో బుధవారం రాత్రి రెండిళ్లలో దొంగతనాలు జరిగాయి. గ్రామానికి చెందిన వేముల గంగాభవానీ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.5వేల నగదుతోపాటు ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు.

 

అలాగే, ఆ పక్కనే ఉన్న చింతం రాములు ఇంట్లో ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న వారిపై మత్తు మందు చల్లి తాపీగా ఇంట్లో వస్తువులను చిందరవందర చేశారు. దాచి ఉంచిన రూ.24వేల నగదుతోపాటు రాములు కోడలు అనిత మెడలోని బంగారు గొలుసు సహా 5 తులాల బంగారు ఆభరణాలను, 5 తులాల వెండి ఆభరణాలను పట్టుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై అంజయ్య సంఘటన స్థలిని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement