శ్రీశైలంలో ఇద్దరు ఆత్మహత్య
శ్రీశైలంలో ఇద్దరు ఆత్మహత్య
Published Thu, Aug 11 2016 12:25 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
– ఒకరు గుంటూరు వాసి
– మరొకరు గుర్తుతెలియని మహిళ
శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన పరిధిలోని అన్నపూర్ణ(కంభం) నిత్యాన్నదాన సత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు గుంటూరు శ్రీనగర్‌కు చెందిన మహంకాళి సైదులు (50)గా గుర్తించారు. మరొకరు గుర్తు తెలియనిlమహిళ. బుధవారం సత్రం డీలక్స్ గది నెం.141 నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అక్కడి సిబ్బంది.. మేనేజర్ వెంకటేశ్వర్లుకు సమాచారం అందజేశారు. ఆయన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ సుప్రజ, సీఐ వెంకటచక్రవర్తి, ఎస్‌ఐ లోకేష్‌కుమార్‌లు అక్కడి చేరుకుని గది తలుపులను తెరిపించారు. మధ్య గదిలో చాపపైన గుర్తు తెలియని మహిళ, బాత్రూం వద్ద మహంకాళి సైదులు మృతదేహాలు కనిపించాయి. ఈ నెల 8న సత్రంలో సైదులు గది తీసుకున్నారు. రిసెప్షన్‌లో ఓటర్ కార్డు, సెల్ నెంబర్‌ను నమోదు చేసుకున్నాడు. అయితే రిజిస్టర్‌లో నమోదైన సెల్ నెంబర్ పనిచేయడం లేదు. గదుల్లో లభ్యమైన సెల్‌ఫోన్‌లో సిమ్‌కార్డులు తొలగించి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మతుడి వద్ద నుంచి సేకరించిన ఓటర్ ఐడీకార్డు లోని అడ్రస్‌లను గుర్తించాల్సిందిగా గుంటూరు శ్రీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వివరాలు పంపించినట్లు ఎస్‌ఐ లోకేష్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టుప్రభుత్వాసుపత్రికి మృతదేహాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సత్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంపై డీఎస్పీ సుప్రజ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల్లో పేర్కొన్నప్పటికీ స్పందించకపోవడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. కెమెరాలు ఉన్నట్లయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా వారి నుంచి పూర్తి వివరాలు తెలిసేవని చెప్పారు.
Advertisement
Advertisement