గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి | unnoneperson suspected death | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

Published Mon, Oct 10 2016 7:58 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి - Sakshi

గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

 
  •   కర్నూలు జిల్లా వాసిగా భావిస్తున్న పోలీసులు
 
ఫిరంగిపురం:  గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలో ఉన్న బాలయేసు కధెడ్రల్‌ దేవాలయ ప్రాంగణంలోని కార్మెల్‌ భవన్‌ వద్ద సోమవారం అనుమానాస్పద స్థితిలో  వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 45–50 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి కార్మెల్‌ భవన్‌ సమీపంలో పడి ఉండటాన్ని సోమవారం తెల్లవారుజామున భక్తులు గుర్తించి ఆలయ పెద్దలకు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ఎం.ఆనందరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఆదివారం మధ్యాహ్నం దేవాలయ ప్రాంగణంలో తలనీలాలు తీయించుకొని  మొక్కుబడి తీర్చుకున్నట్లు ప్రా«థమికంగా గుర్తించారు. మృతుని ఎడమచేతిపై‘ఎన్‌.రామకృష్ణ్ణ’ అని పచ్చబొట్టు వుంది. బ్యాగులో వున్న రైల్వే టిక్కెట్టును పరిశీలిస్తే కర్నూలు జిల్లా బేతంచర్ల నుంచి ఫిరంగిపురం ప్రయాణం చేసినట్లు ఉంది. దేవాలయ ప్రాంగణంలోని సీసీ కెమెరా ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. గుండెపోటు, మూర్చ, విషసర్పాల కాటు లాంటి వాటిలో ఏదైనా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట మార్చురీకి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుని ఆచూకీ గుర్తించిన వారు ఫిరంగిపురంలోని పోలీస్‌ స్టేషన్‌లో నేరుగా, లేదా 0863–257223 ఫోన్‌ నంబర్లో  సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement